Home News గిరిజనుల తల రాత మార్చిన పవన్ కళ్యాణ్

గిరిజనుల తల రాత మార్చిన పవన్ కళ్యాణ్

0

` గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పవన్ వల్లే సాధ్యం
` దేశంలోనే పంచాయతీ రాజ్ శాఖ ఐదు పురస్కారాల్ని సాధించింది
` జనసేన మాజీ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్

జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీబ్రాజ్ శాఖ సత్తా చాటడంపై విశాఖలోని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో ఏపీ రాష్ట్రం ఏకంగా ఐదు అవార్డుల్ని దక్కించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో పంచాయతీ రాజ్ శాఖ ప్రదర్శించిన అత్యుత్తమ పని తీరుకు సముచిత గౌరవం దక్కిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యశీగా రెండు విభాగాల్లో ప్రథమ బహుమతి, మరో విభాగంలో ద్వితీయ బహుమతి, ఇంకో మరో రెండు విభాగాల్లో తృతీయ బహుమతులు సొంతం చేసుకోవడంపై మూర్తి యాదవ్ సంబరపడ్డారు. అడవి తల్లి బాట పేరిట గిరిజన గ్రామాల్లో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెలుగులు నింపారని కొనియాడారు.
ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో నూతన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం స్థాపించారని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ పడకేసిందని, పరిస్థితి..నేడు అదే శాఖ కేంద్ర పురస్కారాలు పొందిందని కొనియాడారు. ఏపీ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచే చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version