Home Politics Andhra Pradesh 33 వ వార్డులో ఆన్లైన్ వైసీపీ క్యాడర్ రిజిస్ట్రేషన్

33 వ వార్డులో ఆన్లైన్ వైసీపీ క్యాడర్ రిజిస్ట్రేషన్

0

పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

వైస్సార్సీపీ ని మరింత బలోపేతం చేసే విధంగా దక్షిణ నియోజకవర్గంలో క్యాడర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో 33 వ వార్డు ముత్తా బత్తుల రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆన్లైన్ ప్రక్రియ విధానాన్ని వాసుపల్లి నేరుగా పరిశీలించారు. పలు సూచనలు సలహాలు తెలియజేస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు వైసీపీలో గుర్తింపు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. క్యాడర్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని అన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. క్యాడర్ రిజిస్ట్రేషన్ ను ఆన్లైన్లో పొందుపరిచి 14 వార్డులో కూడా త్వరితగతన పూర్తి చేయాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశించారు. తన చిన్న కుమారుడు సాకేత్, శ్రావణి ల నూతన దంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి , అధినేత జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన దక్షిణ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ శ్రేణులకు పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పత్చిరిపిళ్లి రాము 33వ వార్డు సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version