Home Politics Andhra Pradesh పెదకోట లో ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ పంపిణీ కార్యక్రమం

పెదకోట లో ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ పంపిణీ కార్యక్రమం

0

మండలంలోని పెదకోట పంచాయతీ, వేలం మామిడి గ్రామంలో, అర్హులైన లబ్ధిదారులకు 31 తేదీ శనివారం నాడు ఇంటింటి ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎక్స్ సర్పంచ్ జె దేముడు మాట్లాడుతూ, ఫిబ్రవరి ఒకటో తారీకున సెలవు రోజు కావడంతో, పెదకోట పంచాయతీలో, శనివారం ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇబ్బంది కలగకుండా, వారి ఇళ్లకే వెళ్లి పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే చేరువయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు, వికలాంగులు, విధవులు వంటి బలహీన వర్గాల జీవనస్థాయి మరింత స్థిరంగా మారుతుందని, పేదరిక నిర్మూలన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ ఇంటింటి పెన్షన్ పథకం ప్రజలు జీవితాల్లో ఆర్థిక భద్రత పెంపొందుతుందని, ఇంటింటికి పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది తో నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇది నిజమైన ఆధారంగా నిలుస్తుందని, సంక్షేమం మాటల్లో కాదు, పనుల్లో చూపిస్తున్న ప్రభుత్వ సంకల్పానికి ఈ పెన్షన్ కార్యక్రమం స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, టిడిపి పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ కే గణేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version