Home News ఏ యూ లో ఎన్ సీసీ ఫార్మేషన్ డే కార్యక్రమం

ఏ యూ లో ఎన్ సీసీ ఫార్మేషన్ డే కార్యక్రమం

0
  • ఏ యూ లో ఎన్ సీసీ ఫార్మేషన్ డే కార్యక్రమం
  • బోధిధర్మ యుద్ధ కళాక్షేత్ర యోధుల ప్రతిభకు అధికారుల ప్రశంసలు

విశాఖపట్నం:(జయ జయహే)
ఆంధ్ర విశ్వవిద్యాలయం బీచ్ రోడ్డులోని ఏ యూ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఎన్సీసీ ఫార్మేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, డీజీ ఎన్సీసీ, నౌకాదళం, భూసేన, వాయుసేనకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కార్యక్రమంలో 1500 మంది ఎన్ సీసీ క్యాడెట్లు పాల్గొని తమ క్రమశిక్షణ, నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రానికి చెందిన 14 మంది యోధులు వెంకటరావు నాయకత్వంలో ఖతాస్, స్టిక్ ఫైట్, నంచక్, స్వోర్డ్ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు.

ప్రదర్శన అనంతరం ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ నిరజ్ కుమార్, స్వర్ణిమ యోధులను తమ కార్యాలయానికి ఆహ్వానించి వారి అద్భుత ప్రదర్శనను అభినందించారు. యోధులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చేసిన కృషిని వైజాగ్ జిల్లా పెంకాక్ సిలాట్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఆడారి కిషోర్ కుమార్ ప్రశంసించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version