Home Politics Andhra Pradesh ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం

0

జాతీయ 16వ ఓటర్ దినోత్సవం ఆదివారం మాడుగుల్లో ఘనంగా జరిగింది. మాడుగుల నియోజవర్గ ఈ ఆర్వో ఎస్డి అనిత ఆధ్వర్యంలో మాడుగుల రెవెన్యూ కార్యాలయం నుంచి ప్లకార్డులతో సైకిల్ ర్యాలీ ప్రారంభమై పురవీధుల మీదుగా బస్టాండ్కు చేరుకొని అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ఆర్ వో అనిత మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు దేశ సమగ్ర అభివృద్ధిని కాంక్షించే ఓటరుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు హక్కున సద్వినియోగం చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే రమాదేవి, ఉప తహసిల్దార్ రాజా, కార్యాలయ సిబ్బంది పాఠశాల,కళాశాల విద్యార్థులు స్థానిక యువకులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version