Home Politics Andhra Pradesh మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

0

నిడదవోలు పట్టణంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిడదవోలు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు మోర్త ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుంటూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భీమేశ్వరరావు, నిడమర్తి భాస్కరరావు, బలిజేపల్లి సూర్యనారాయణ, సురేష్ శర్మ, గన్నబత్తుల మూర్తి, విజయ్ కృష్ణ, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిస్ట్రిక్ ఎస్యూటీ మెంబర్ పల్లి వీర రాఘవులు, ఏఎంసీ డైరెక్టర్ సతీష్‌తో పాటు కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, పదాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం దేశ ఐక్యతకు ప్రతీక అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version