Home Politics Andhra Pradesh నా అన్వేష్ బ్యాన్

నా అన్వేష్ బ్యాన్

0

యూట్యూబర్ ఖాతా తొలగింపు

దూషణలు, జుగుప్సాకర వ్యాఖ్యల ఫలితం

ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేష్’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్ అయింది. ‘నా అన్వేష్’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. దీంతో ఆ ఖాతా వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. దీంతో వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం స్పందించి వివరాలు పంపించింది. అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నుంచి లేఖ వచ్చిన వెంటనే అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించిన మేనేజ్‌మెంట్ బ్యాన్ చేసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది. తెలుగులో ఎక్కువ మంది వీక్షించే ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ఒకరు. మహిళల వస్త్రధారణపై కొద్ది రోజుల క్రితం చెలరేగిన వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఆ సమయంలో అన్వేష్ ఓ వీడియో రూపొందించాడు. తన వాదన వినిపించే క్రమంలో చెప్పరాని భాష వాడడం, హిందూ దేవతల పేర్లు తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. పురాణగాథల్లో జరగని ఘటనలు జరిగినట్టు అర్థం వచ్చేలా, సీత, ద్రౌపదిల గురించి వ్యాఖ్యానించాడు. ప్రవచనకారుల గురించి జుగుప్సాకరంగా మాట్లాడాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version