Home News భక్తుల కోసం ఎం వి ఆర్ ఉచిత బస్సులు

భక్తుల కోసం ఎం వి ఆర్ ఉచిత బస్సులు

0

ప్రశంసించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది.ఈ గ్రామం నుండి దొడ్డి ప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మహిళలందరూ ఎం వి ఆర్ ట్రస్ట్ సహకారం తో ఏర్పాటుచేసిన ఉచిత తీర్థయాత్ర బస్సును బిజెపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, చోడవరం నియోజవర్గ ఇన్చార్జ్ ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కందర్ప రమణమూర్తి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా పరమేష్ ఎం వి ఆర్ సేవలను ప్రశంసిస్తూ.. సామాన్యులకు కూడా పుణ్యక్షేత్రాల దర్శనం భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఎం వి ఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ మేరకు భక్తుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువసేన సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్య వేక్షించారు. తమ గ్రామం నుండి ఉచితంగా తీర్థయాత్రకు అవకాశం కల్పించిన ఎం వి ఆర్ కు జుత్తాడ గ్రామప్రజలు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ద్వారపురెడ్డి పరమేష్‌ను గ్రామస్థులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version