దక్షిణ నియోజకవర్గం 33 వార్డు వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలువురు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ , జనసేన పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి జీకే , వార్డ్ అధ్యక్షులు రాజు , కూటమి సీనియర్ నాయకులు చక్రవర్తి , సత్యనారాయణ , వెంకట అప్పారావు , జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు , ఏ పి డి పద్మ కూటమి పెద్దలు పాల్గొన్నారు.
