మంత్రి ఆదేశాలతో సరైన పత్రాలు, భద్రత ప్రమాణాలు లేని బస్సును సీజ్
గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా వద్ద రవాణా భద్రత చర్యల్లో భాగంగా పలు బస్సులపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో సరైన పత్రాలు, భద్రత ప్రమాణాలు లేని 20 కు పైగా బస్సులలో రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేసి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒక బస్సును సీజ్ చేశారు.15 బస్సులపై చలాన్లు విధించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బస్సుల సాంకేతిక స్థితి, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, భద్రతా ప్రమాణాల అమలు, డ్రైవర్లు సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న నియమాలు, వేగ పరిమితులు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నారు.
అలాగే ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, టికెట్ విధానం, సీటింగ్ సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే భద్రతా పరికరాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఈ తనిఖీలు అందులో భాగమని అధికారులు వెల్లడించారు.
రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, నియమ నిబంధనల అమలును పటిష్టం చేయడం, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ప్రయాణికుల్లో అవగాహన కల్పించారు.
ఈ తనిఖీలకు సంబంధిత శాఖల అధికారులు హాజరై పరిస్థితులను సమీక్షించనున్నారు.
