సాహసం…సమన్వయం…సహకారం
ప్రపంచ దళాలు నేర్చుకున్నారని తూర్పు నావికాదళ చీఫ్ ప్రకటన
రెండు దశల్లో జరిగిన మిలాన్ 2026 బుధవారంతో ముగిసిందని తూర్పు నావికాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి తెలిపారు. ఈ నెల 19 నుంచి 20 వరకూ , 21 నుంచి 25 వరకూ రెండు దశల్లో ఈ మిలాన్ కార్యక్రమం విశాఖ కేంద్రంగా జరిగిందన్నారు. ఇది పెరుగుతున్న సముద్ర దళాల కలయిక, విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ అద్భుతమైన సముద్ర దళాల సమావేశంలో పాల్గోడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించిన మన స్నేహితులు, భాగస్వాములందరికీ హౄదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తున్నానన్నారు. భారత్ గొప్ప సముద్ర వారసత్వం కలిగిన దేశం అని, ప్రపంచ సామూహిక భద్రత, వారి శ్రేయస్సు కోసం మహా సముద్రాలను అసుసంధాన వంతెనలుగా చేసుకోవడం అభినందనీయమన్నారు. సురక్షిత సముద్ర వాతావరణాన్ని విభిన్న నావికాదళాలను భాగస్వామ్యంగా నిర్వహించడమనే ఈ వ్యాయామం మిలాన్ స్పూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు.