Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshమధ్యాహ్న భోజన స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి

మధ్యాహ్న భోజన స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి

సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు

మధ్యాహ్న భోజన పథకాన్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో గత 23 ఏళ్లుగా వండి పెడుతున్న వంటలమ్మ ల పొట్టకొట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్థూ ఏప్రిల్ 8న జిల్లా వ్యాప్తంగా ఎంఈఓ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం చోడవరం మెయిన్ హైస్కూల్లో కార్మికులతో కరపత్రాన్ని ఆవిష్కరించి పలు స్కూళ్లలో పర్యటించి కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర బిజెపి, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు “స్మార్ట్ కిచెన్” పేరుతో ఒకే చోట వండి స్కూళ్లకు పంపాలని ప్రభుత్వం ఏర్పాట్లూ చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి పిల్లలకి వండి పెట్టాలని వేడివేడిగా ఆహారం అందిస్తున్నారు. సంవత్సరాలు తరబడి జీతాలు పెరగలేదు, అయినా మధ్యాహ్నం భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని, ప్రైవేట్ పరం చేయాలని ప్రతి మండలంలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందనీ . అక్షయపాత్ర, నవ ప్రయాస్,ఇస్కాన్ వంటి సంస్థలు పిల్లలకు పౌష్టికాహారం కలిగించే కోడుగుడ్డుని పెట్టరు! ఉల్లిపాయలు వాడరు! మధ్యాహ్న భోజన పథకం వలన చదువుకునే పిల్లల సంఖ్య పెరిగిందని, డ్రాపౌట్స్ తగ్గాయని, బాలికలలో చదువుకున్న వారి సంఖ్య పెరిగిందని ప్రభుత్వమే చెబుతోందన్నారు. అటువంటి పేదలకు విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే చూస్తున్నది. స్మార్ట్ కిచెన్ పేరుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వేలాది మంది వంట కార్మికుల ఉపాధి పోగోడుతున్నారు. వంట కార్మికుల ఉపాధి రక్షణ కోసం, స్మార్ట్ కిచెన్ కు వ్యతిరేకంగా ఏప్రెల్ -8న ఎం.ఇ.ఓ. ఆఫీసుల వద్ద ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎస్ వి నాయుడు, బుచ్చి రాజమ్మ, బాదిరెడ్డి లక్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments