Home Politics Andhra Pradesh శివుని అనుగ్రహం అందరిపై ఉండాలి

శివుని అనుగ్రహం అందరిపై ఉండాలి

0

డాక్టర్ కందుల నాగరాజు

ప్రతి ఒక్కరిపై శివుని అనుగ్రహం ఉండాలని
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అభిలాషించారు.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో తన కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు కుటుంబ సమేతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భోలేనాథుడైన శివుడు త్వరగా ప్రసన్నుడై, భక్తుల కష్టాలను తొలగించి శాంతి, శ్రేయస్సు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పారు. శివుని కృప కోసం సోమవారం ఉపవాసం, రుద్రాభిషేకం చేయడం, ఓం నమః శివాయ మంత్ర జపం చేయడం చాలా మంచిదని అన్నారు.శివుని అనుగ్రహం పొందడం అంటే కష్టాల నుండి విముక్తి, మానసిక ప్రశాంతత, సమృద్ధిని పొందడమని తెలిపారు.
స్వచ్ఛమైన భక్తితో శరణాగతి చెందితే శివుడు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతాడని అన్నారు.
భోలేనాథుడి కృపతో జీవితంలోని ఇబ్బందులు,బాధలు తొలగిపోతాయని,
మానసిక ప్రశాంతత, కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, నిలిచిపోయిన పనులు సత్వరమే పూర్తి కావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం,
శివుడు భక్తికి మాత్రమే లోబడి, త్వరగా ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించే దేవుడని కొనియాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version