Home Politics Andhra Pradesh వడ్డాది వెంకన్న ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

వడ్డాది వెంకన్న ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

0

జిల్లా దేవాదాయ అధికారి

వడ్డాది వెంకటేశ్వర స్వామి 153వ వార్షిక కళ్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కేఎల్ సుధారాణి తెలిపారు.బుధవారం ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం రాత్రి ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమై మార్చి 4 పుష్పాంజలితో ముగుస్తాయన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మూడవ తేదీ గుడి మూసివేస్తారన్నారు. సంప్రోక్షణ అనంతరం నాలుగో తేదీ తెల్లవారుజామున భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారన్నారు.ఈనెల 27న తిరువీధి ఉత్సవం నిర్వహించి స్వామివారి కల్యాణం జరిపిస్తారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.భక్తులకు త్రాగునీరు క్యూలైన్లు, వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు,పిఆర్, రెవిన్యూ అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు.ఈవో టిఎన్ఎస్ శర్మ, ఎస్ఐ శ్రీనివాసరావు, అర్చకులు అంగర శ్రీకాంతాచార్య పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version