Home Politics Andhra Pradesh మహాత్మా గాంధీ ఉపాధి కావాలి జి రామ్ జీ వద్దు

మహాత్మా గాంధీ ఉపాధి కావాలి జి రామ్ జీ వద్దు

0

మాడుగుల మండలం శంకరం పంచాయితీలో వెలగలపాడు గ్రామంలో సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపుకు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీజీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీజీ పేరును తొలగించడం అన్యాయమని మహాత్మా గాంధీ ఉపాధి కావాలి జిరామ్ జీ వద్దు అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కార్లి భవాని మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం అన్యాయమని,మహాత్మా గాంధీ ఉపాధి కావాలని జిరాంజీ వద్దు అని భూమిలేని కూలీలకు పేద కుటుంబాలకు సామాజిక భద్రత వలయంగా పనిచేసింది అన్నారు. జి.రాంజీలో రాష్ట్రాలకు ప్రాంతాలవారీగా నిర్ణయించి నా కేటాయింపులో 60 శాతం కేంద్రం 40% రాష్ట్రాల ఖర్చు పంచుకునే నమూనాను తీసుకువచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు.ఈ కార్యక్రమంలో గోట్టూరు అప్పారావు,యడ్ల కోండలరావు,కోర్రి ఈశ్వరావు,అప్పారావుకోండలరావు, తుర్రె కన్నారావు,చిప్పాడ అప్పారావు,యడ్ల.l వరలక్ష్మి,కూడ రమణమ్మ,చిప్పాడ పోలమ్మ,చిప్పాడ సీత, కూడ కన్నారి, గాటిలమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version