Home Politics Andhra Pradesh రహదారులకు మహర్దిశ

రహదారులకు మహర్దిశ

0

రోడ్లకు నిధులు మంజూరు చేయడంపై కూటమి నేతలు హర్షం
ఎమ్మెల్యే రాజు కృషితోనే రోడ్లు అభివృద్ధి మండలంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు నిధులు మంజూరు చేయడం తో రహదారులకు మహర్దశ వచ్చిందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.గురువారం కోమాళ్ళపూడిలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న రహదారులను దశలవారీగా అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే ప్రణాళిక రూపొందించారని వారు తెలిపారు.మొదటి విడతగా 38.1 కి.మీ. మేర రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.11.61 కోట్లు మంజూరు చేయించారన్నారు.వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడతారన్నారు.చోడవరం నుంచి తిమ్మనపాలెం మీదుగా బుచ్చెయ్యపేట మండలం కె.బి రోడ్డుకు రూ.2.35 కోట్లుతో 9.8 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.తిమ్మనపాలెం నుంచి ఆర్ఈసీ రహదారి వయా పోలేపల్లి, మట్టవానిపాలెం వెళ్లే 9కి.మీ రహదారికి రూ.2.76 కోట్లు, కశింకోట-బంగారుమెట్ట రహదారి నుంచి ఆర్ఈసీ రహదారి వయా పెదమదీనా, గున్నెంపూడి వెళ్లే 9.2కి.మీ. రహదారిని 1.6 కోట్లతో అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజుకి
కృతజ్ఞతలు తెలిపారు.మండల టీడీపీ అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారాయణ,పిఏసీఎస్ అధ్యక్షుడు డొంకిన అప్పలనాయుడు, ఏపీ గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి, మండల ఎంపీటీసీ లు ఫోరమ్ అధ్యక్షులు దేవర అప్పారావు,వడ్డాది టీడీపీ సీనియర్ నాయకులు దొండా గిరిబాబు, సయ్యపురెడ్డి శ్రీనివాస్,మండల తెలుగు యువత అధ్యక్షుడు సింగపల్లి రమేష్, తుమ్మపాల కన్నం నాయుడు, తదితరులు పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version