Home Politics Andhra Pradesh మా ఘోష వినండి మహాప్రభో…..కదం తొక్కిన ఎలక్ట్రికల్ మీటర్ రీడర్స్ యూనియన్

మా ఘోష వినండి మహాప్రభో…..కదం తొక్కిన ఎలక్ట్రికల్ మీటర్ రీడర్స్ యూనియన్

0

ఏఐటియుసి ఆధ్వర్యంలో విశాఖ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ మూడు రోజులగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ,రిలే నిరాహార దీక్షలు నిర్వహించి, మీటర్ రీడర్స్ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని వినతి పత్రం ఇచ్చిన విద్యుత్ సిఎండి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నేడు విద్యుత్ మీటర్ రీడర్లు మూడు డిస్కంల పరిధిలో మీటర్ రీడర్స్ యూనియన్ విశాఖ విద్యుత్ సిఎండి ఆఫీసును ముట్టడించి, సమస్యల గోసను ,గలమును హోరెత్తించి వినిపించారు. విద్యుత్ సీఎంది వారికి సమస్యల విన్నత పత్రాన్ని అందజేశారు .విద్యుత్ సంస్థను నమ్ముకొని గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ కు,సంస్థలో ఉపాధి కల్పించి, ఉద్యోగ బాధ్యత కల్పించాలని, మరియు నెలవారీ వేతనాలు అమలు చేయాలని గత ప్రభుత్వం సమయంలోనే నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్, లోకేష్ నాడే మా సమస్యలను తెలియజేయగా, మన ప్రభుత్వం అధికారంలోకి
రాగానే విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థలో శాశ్విత ఉద్యోగ భద్రత కల్పిస్తామని
హామీ ఇచ్చియున్నారు, కానీ నేడు ఆ హామీలను,తుంగలో తొక్కి,నేడు స్మార్ట్ ఎలక్ట్రికల్ పెట్టి 4500 మంది ఉన్న మీటర్ లీడర్లల కుటుంబాలును నిర్ధాక్షణంగా రోడ్డు మీద పడేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది.,కరోనా సమయంలో కూడా పని చేసి విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థకు ఆదాయాన్ని ఇచ్చారు. ఎంతోమంది విద్యుత్ మీటర్ రీడర్స్,కరోనాతో మరణించారు. వారికి కూడా విద్యుత్ సంస్థగాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇటువంటి సహాయము చేయలేదు. విద్యుత్ మీటర్ రీడర్స్ కు సంస్థలో ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మా న్యాయమైన సమస్యల పట్ల
ప్రభుత్వం స్పందించకపోయినచో మేము చలో విజయవాడ పిలుపునిచ్చి,మహా ధర్నా కు, పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికను జారీ చేశారు విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు. జిల్లా ఏఐటీయూసీ నాయకులు జి ఎస్ జె అచ్యుతరావు , ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పడాల రమణ, ఎల్ రామకృష్ణ, తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version