Friday, May 1, 2026
HomeNewsహాక్ ధన్ ఓపెన్ ఇన్నోవేషన్ లో లెండి కాలేజీ విద్యార్థుల ప్రతిభ

హాక్ ధన్ ఓపెన్ ఇన్నోవేషన్ లో లెండి కాలేజీ విద్యార్థుల ప్రతిభ

సృజన 2026
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ సెల్ (సావిష్కార్) ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల హాక్ థన్ ఓపెన్ ఇన్నోవేషన్ లో విజయనగరం లెండి కాలేజ్ విద్యార్థులు ధనుష్, చాందిని,దీక్షిత, ప్రసన్న లు 2 వ ప్రైజ్ గెలిచారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయికుమార్ , లెండి కళాశాల ప్రిన్సిపాల్ రామరెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 800 పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారని , సృజన 2026 విజయవంతంగా పూర్తయింది
డా. హర ప్రసాద్, సృజన వాలెడిక్టరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వికసిత భారత్ 2047 సాధనలో సాంకేతికత మరియు విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. భారత్‌ను విశ్వ గురుగా తీర్చిదిద్దడంలో ఆత్మనిర్భరత అవసరమని, ఆపరేషన్ సింధూర్ వంటి ఉదాహరణలతో దేశం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments