- ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం
- టీమ్ స్పిరిట్ తో ముందుకు
- తుఫాన్ ను ధీటుగా ఎదుర్కొన్నాం
- సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు
- తుఫాన్ యంత్రాంగానికి సీఎం అభినందనలు
- అద్భుతంగా పని చేసిన వారికి ప్రశ్నాపత్రాలు జారీ
(అమరావతి – జయజయహే)
మొంథా తుపాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ప్రతీ సంక్షోభం ఓ అవకాశం అన్న సీఎం ఈసారి తుపాను నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్‌గా రూపొందిద్దామని వెల్లడించారు.
ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమం నిర్వహించారు. మొంథా తుపాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. తుపాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పని చేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఫలితంగానే మొంథా తుపాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘తుపానుపై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాం. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడాం. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడాం. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయి. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించారు.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాయలసీమకు కరవు, కోస్తాంధ్రకు తుపాన్లు : రాష్ట్రానికి రెండు సమస్యలు ఉన్నాయన్న సీఎం, ఒకటి రాయలసీమకు కరవు, రెండోది కోస్తాంధ్రకు తుపాన్లని వివరించారు. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమలో కరవు అనేది లేకుండా చేశామన్నారు. మొంథా తుపాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ను సిద్ధం చేస్తే, వారంతా అద్భుతంగా పని చేశారని కొనియాడారు. వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామని వెల్లడించారు.
పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లో హెచ్చరికలు : అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపించామన్నారు. వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశామని వివరించారు. అతి పెద్ద తుపాన్‌ను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశామని ముఖ్యమంత్రి అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించామని సీఎం అన్నారు. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్పూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కూడా ఈ స్పూర్తిని అందిపుచ్చుకోవాలని కోరారు.
