Home Politics Andhra Pradesh పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన కేఎన్ఆర్

పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన కేఎన్ఆర్

0

ఏపీ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అండిబోయిన అప్పారావు మరల భాస్కరరావు ఆధ్వర్యంలో పెదగంట్యాడ ఆర్.జి ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఐదవ డేడ్ లిఫ్ట్ ఎనిమిదవ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు రెండురోజులు జరుగనున్నాయి .ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజేపి స్టేట్ మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణం రెడ్డి నరసింగరావు,హైకోర్టు న్యాయవాది జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అండి బోయిన లక్ష్మి , ఏ ఎస్ ఐ బి.అనురాధ పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్బంగా కరణం రెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ క్రీడలు అంటే ఆరోగ్యం మని ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువైపోతున్న పొల్యూషన్ లో పేరు తెలియని వ్యాధులు వచ్చే తరుణంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎంతో అవసరం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక రకమైన స్పోర్ట్స్ లో ఉండి ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ప్రాక్టీస్ చేసినవారికి ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉంటుందని అదేవిధంగా స్పోర్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యాంగా కనిపిస్తారని అన్నారు.
హైకోర్టు న్యాయవాది జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అండి బోయిన లక్ష్మి మాట్లాడుతూ ఏపీ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ క్యాటగిరిలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి క్యాటగిరీలో అందరికన్నా ఎక్కువ బరువులు లిఫ్ట్ చేసిన వారు స్ట్రాంగ్ మెన్ టైటిల్ ని గెలుపొందుతారని అన్నారు. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దానితో పాటుగా ప్రతి క్యాటగిరీలో గెలుపొందిన వారికి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ సర్టిఫికెట్స్ అందించడం జరుగుతుంది అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్లసత్యారావు,ప్రధాన కార్యదర్శి గుత్తుల రాంబాబు ,ఆర్కే ఫిట్నెస్ రామకృష్ణ రాము, రామ్ లక్ష్మణ్ ,దొర పలు జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version