క్యాన్సిల్ చేసుకునే సమయంలో తిరిగి మనకు వచ్చే డబ్బులు చాలా స్వల్పం. అయితే ఇక నుంచి ఆ బాధ ఉండదు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పడు దాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఖాళీలను బట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అది కాకుండా రిజర్వేషన్ చేసుకున్న రైలు కాకుండా వేరే రైలుకు కావాలన్నా ఆ రైలుకు కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని బదిలీ చేసుకోవచ్చు . దీని వల్ల క్యాన్సిలేషన్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. ఈ సౌకర్యం ఇప్పటివరకు రైల్వేలో లేదు. దేశంలో మొదటిసారిగా రైల్వే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సౌకర్యం ఎక్కడి నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు. రిజర్వేషన్ చేసుకున్న చోటు నుంచే కాకుండా ఎక్కడ నుంచి అయినా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.
