Home Politics Andhra Pradesh కేశవరావుకు ‘సాహితీ సింహ’ పురస్కారం ప్రదానం

కేశవరావుకు ‘సాహితీ సింహ’ పురస్కారం ప్రదానం

0

సాహిత్య, పాత్రికేయ రంగంలో విశేష కృషి చేస్తున్న మద్దిలి కేశవరావు ప్రతిష్టాత్మకమైన ‘సాహితీ సింహ’ పురస్కారం అందుకున్నారు. కాశీబుగ్గ – పలాసకు చెందిన జనజాగృతి సాహితీ సంస్కృతి సమాఖ్య దశమ వార్షికోత్సవం సందర్బంగా గురువారం ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. కేశవరావు సాహిత్య సేవలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఆయన రచనలు సామాజిక స్పృహను పెంపొందిస్తూ పాఠకులను ఆలోచింపజేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేశవరావుకు ప్రశంసాపత్రం, స్మారక చిహ్నం అందజేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తెప్పల క్రిష్ణమూర్తి, ప్రముఖ నాటక రచయిత లండ రుద్రమూర్తి, మడ్డు తిరుపతిరావు పలువురు సాహితీ ప్రముఖులు, అభిమానులు పాల్గొని అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version