` పట్టించుకోని స్థానిక పోలీసులు
` ఒంటరి మహిళలే లక్ష్యంగా రౌడీమూకలు
కంచరపాలెం రైతు బజార్ వెనుక జాతీయ రహదారి ప్రాంతంలో రౌడీ మూకల ఆగడాలు అలజడి రేపుతున్నాయి. గంజాయి మత్తులో ఉన్న రౌడీలు అక్కడే తిష్ట వేసి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొండ పై భాగం నుంచి ఏ పనికైనా కిందికి వచ్చే మహిళలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. వారి వెంట పడుతూ ఆట పట్టించడం…లేదంటే పైశాచిక ఆనందం కోసం వారితో అసభ్యంగా ప్రవర్తించే సంఘటనలు నిత్యకత్యం. రైతు బజార్ వెనుక ప్రాంతంలో వీధి లైట్లను కూడా వారే పగలగొట్టేసి చీకటి రాజ్యంలో వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ మార్గంలో నడవాలంటేనే భయమేస్తోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే పోలీస్ విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ తమకెందుకులే అన్న రీతిన ఆ పోలీసులు ఉండడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. మద్యం, గంజాయి, సిగరెట్లు తాగుతూ బండబూతులు తిట్టుకుంటూ అలజడి రేపుతున్నారు. చీకటి పడితే వారు మరింత ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంచరపాలెం పోలీసులకు ఈ అల్లరి రౌడీ మూకల ఆగడాలు గురించి తెలిసినప్పటికీ వాళ్లతో చాకిరీ చేయించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం కారణంగానే వారి ఆగడాలు మరింత శతిమించుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గంజాయి బ్యాచ్ కావడంతో చీకటి పడితేనే మహిళలు అక్కడ బయటకు రావడానికి భయపడుతున్నారు. వారి ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు కూడా మహిళలు భయపెడుతున్నారంటే వాళ్ల పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు.
కంచరపాలెం గంజాయి బ్యాచ్ బరితెగింపు
RELATED ARTICLES
