Home Politics Andhra Pradesh వెలంపేటలో ‘కంబాల కానుక’ కార్యక్రమం

వెలంపేటలో ‘కంబాల కానుక’ కార్యక్రమం

0

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెలంపేట గ్రామంలో ధనదుర్గ అమ్మవారి జాతర సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “కంబాల కానుక – వనితలకు వేడుక” కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఆయన గ్రామంలోని మావుళ్ళమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన సుమారు 3.5 కిలోల వెండి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం ధనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతర సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 650 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలను పంపిణీ చేశారు. మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన ప్రతినిధులు, మండల కార్యకర్తలు, గ్రామస్తులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version