కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద శాశ్వత షెడ్డు నిర్మాణానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రెండు లక్షలు రూపాయలు విరాళాన్ని కోరుకొండ గ్రామంలోని రామసేన కార్యాలయం వద్ద సోమవారం రాత్రి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద శాశ్వత షెడ్డు నిర్మాణానికి 13 లక్షలు రూపాయలు విరాళాన్ని గతంలో ప్రకటించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతగా మూడు లక్షలు రూపాయలు విరాళం అందించమని తెలుపారు. అలాగే సోమవారం రాత్రి మరో రెండు లక్షలు రూపాయలు చెక్ ను కమిటీ సభ్యులకు అందించారు. ఇప్పటి వరకు షెడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు విరాళాన్ని అందించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
