Saturday, April 18, 2026
HomeNewsజాన్ వెస్లీ సేవలు నిరుపమానం

జాన్ వెస్లీ సేవలు నిరుపమానం

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*

వైయస్సార్సీపి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ సేవలు నిరుపమానమని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పుష్పగుచ్చం అందజేసి వాసుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. వైయస్సార్సీపి లో విశిష్ట సేవలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. క్రిస్టియన్ సోదరులకు వైసిపి ప్రభుత్వం ద్వారా సముచిత స్థానం కల్పించేందుకు, అలాగే వారికి రావలసిన పథకాలపై ఎంతగానో కృషి చేశారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో తనతోపాటు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న జాన్ వెస్లీ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వాసుపల్లి ఆకాంక్షించారు. దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని వాసుపల్లి గణేష్ కుమార్ దీవెనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డు అధ్యక్షులు పీతల వాసు, నీలాపు సర్వేశ్వర్ రెడ్డి,స్టేట్ మజీ డైరెక్టర్ స్టేట్ యూత్ సెక్రటరీ కనకల ఈశ్వరరావు, జిల్లా వైస్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు, స్టేట్ ఆర్టిఏ సెక్రెటరీ ఈతలపాక విజయ్, జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రటరీ అరుగుల రాజు, జిల్లా నాయకులు ఎలమంచి సంతోష్, జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి, వార్డ్ నాయకులు విజయ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments