Home Politics Andhra Pradesh అంగన్వాడీల ఉద్యోగ భద్రత కల్పించాలి

అంగన్వాడీల ఉద్యోగ భద్రత కల్పించాలి

0

శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలి

అంగన్వాడీల ఆందోళనకు మరింత సిద్ధం

అలనాటి బ్రిటిష్ లేబర్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం అదమర్చి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూకార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నిర్బంధాలను పెంచి శాంతి భద్రతలకు కార్మిక సంక్షేమానికి తుట్లు పొడుస్తున్నారని సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు వ్యక్తం చేశారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రెండో రోజు అంగన్వాడీల నిరసన ధర్నాకు తమ మద్దతు తెలిపారు, అంగన్వాడీల సమస్యపై పలుమార్లు పోరాటాలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వాలకు వినతలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ పాలకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని ఇది కార్మికులు పేద ప్రజలపై ఎనలేని భారం పడుతుందని ఆయన అన్నారు.
నిర్బంధాలను అధిగమించి ముందుకు సాగుతున్న పేద ప్రజలు మధ్య మత కలహాలు మతోన్మాద శక్తుల ఆ రాచకాలు జరుగుతున్నాయని దీన్ని పోరాటం ద్వారా సాధిస్తామన్నారు అంగన్వాడీలకు కనీస వేతనాలు 26 వేలు మంజూరు చేసి శ్రమకు తగిన ఫలితాలను అందించాలని ప్రజాసంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు షణ్ముఖరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ ప్రతినిధులు ఆదిలక్ష్మి, రవణమ్మ, వెంకటరత్నం, జయ, రోహిణి, ధనలక్ష్మి, విమల కుమారి, రేవతి, స్వప్న, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version