Home Politics Andhra Pradesh పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో జనసైనికులు

పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో జనసైనికులు

0

ప్రాథమిక పాఠశాల కు టైల్స్ అందజేత
సమాజ సేవే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు కాజులూరు జనసైనికులు మద్దతు తెలియజేశారు. విద్యా రంగం అభివృద్ధి చెందితేనే సమాజం ముందుకు సాగుతుందనే సంకల్పంతో కాజులూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.30 వేల విలువైన టైల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు జనసైనికులు తెలిపారు. కాజులూరు ప్రధాన ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి గది నేల పాడై ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని వెంటనే స్పందించారు. కొత్త టైల్స్ అమర్చడం ద్వారా తరగతి గది శుభ్రంగా, అందంగా మారడమే కాకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సహకార సంఘ అధ్యక్షుడు యాళ్ల వెంకటరమణ స్థానిక నీటి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ
లు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి అవసరమైన ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, అదే పవన్ కళ్యాణ్ చూపుతున్న మార్గమని అన్నారు. సహకారం అందించిన గొర్రెల సుధాకర్, పెంటపాటి పద్దరాజు ,పుల్లెపు నాని ,పడాల పాండురంగ ,కూటి రంజిత్ కుమార్ , సుధాకర్, నామ శీను ,చోడిశెట్టి మధుబాబులను అభినందించారు.
. ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యా సదుపాయాల అభివృద్ధికి స్థానిక స్థాయిలో ముందడుగు వేయడం ద్వారా కాజులూరు జనసైనికులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
సమాజంలో సేవా కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా కొనసాగాలని, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుర్గారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version