Home Politics Andhra Pradesh జగన్ మాటంటే… మాటే…!

జగన్ మాటంటే… మాటే…!

0

– వైసీపీ జిల్లా అధ్యక్షులు కె.కె రాజు
– అధ్యక్షత వహించిన ప్రచార కమిటీ అధ్యక్షులు రవిరాజు  మాట ఇవ్వడమే కాకుండా యిచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ జిల్లా అధ్యక్షులు కే కే రాజు అన్నారు.
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు జివి రవి రాజు నిర్వహణలో ఉత్తరాంధ్ర ప్రచార విభాగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల క్షేమమే లక్ష్యంగా ఆలోచించి, చెప్పిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని, దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా, ఎన్నికల్లో హామీలు ఇచ్చి వాటిని అక్షరాలా అమలు చేసిన నాయకులు చాలా అరుదుగా ఉంటారని కానీ జగన్ చెప్పింది చెప్పినట్లే చేసి చూపించిన నాయకుడని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంపై పూర్తి దృష్టి పెట్టిన కారణంగా పార్టీ నిర్మాణంపై తగినంత దృష్టి పడలేదు. చెట్టు నిలవాలంటే వేర్లు బలంగా ఉండాలని, అలాగే పార్టీ నిలవాలంటే క్షేత్రస్థాయి కమిటీలు బలంగా వుండాలన్నారు. జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీలు లో బంధుప్రీతి లేకుండా, నిజంగా పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి, పాత కార్యకర్తలను పక్కన పెట్టకుండా 2014, 2019 కమిటీల డేటా ఆధారంగా పునర్నిర్మాణం చేయాలన్నారు. మన కష్టం వృథా కాకూడదని, ఇప్పుడే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తేనే రేపు మళ్లీ ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురాగలమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పచార విభాగం అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు , మాజీ మేయర్ గోలగాని హరివెంకటకుమారి, ఎస్.ఇ.సి సభ్యలు సతీష్ వర్మ , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్నదాస్, తాడి జగన్నాధ్ రెడ్డి , పల్లా దుర్గారావు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ , రాష్ట్ర పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షులు జాన్ వెస్లీ , పెర్ల విజయ్ చంద్ర, రాష్ట్ర పార్టీ అనుబందం కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్న జానకి రామ్ , జోనల్ జిల్లా పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షులు పివి సురేష్, , బోని శివ రామకృష్ణ, వంకాయల మారుతీ ప్రసాద్, దేవరకొండ మార్కెండేయులు, మాజీ చైర్మన్లు అలంపల్లి రాజ బాబు కార్పొరేటర్లు బిపిన్ కుమార్ జైన్, కో ఆప్షన సభ్యులుఎండి షరాఫీ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం కాయ భీమసేన , విజయనగరం వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు పార్వతీపురం మన్యం గిరి రఘు అల్లూరి సీతారామ రాజు ధోని బాపూజీ అనకాపల్లి పిల్లా శ్రీను రాష్ట్ర ప్రచార విభాగం కమిటీ ఉపాధ్యక్షులు రావూరి వెంకటేశ్వరరావు కాకూ ఉమావల్లి యాదవ్ ప్రధాన కార్యదర్శి బెతపూడి రాజేంద్ర కుమార్ కార్యదర్శులు బంకుపల్లి లోకనాధం శర్మ పొడిపిరెడ్డి అరుణ వనా అహరోన్ పాల్ వామిశెట్టి పవాని కుమారి వట్టికూటి కృష్ణ వేణి , మహంతి కృష్ణ మోహన్ , సురేష్ , నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version