Home News సత్య దేవుని సన్నిధిలో మరో దేవుని పూజలా…!

సత్య దేవుని సన్నిధిలో మరో దేవుని పూజలా…!

0

బ్రహ్మకుమారీలకు ఎందుకు అనుమతిచ్చారో ,రత్నగిరిపై శివ బాబాను పూజించాలనడం సరైనదేనా ,అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధిలో బ్రహ్మ కుమారీలకు ఏం పని అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు వాళ్లకు ఉచితంగా ఎలా అనుమతి ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. సత్య దేవుణ్ని కాకుండా మరో దేవుడు పేరు చెప్పే ఇలాంటి వారికి అసలు రత్నగిరి క్షేత్రం ఎక్కే పనేంటని అడుగుతున్నారు. దీనికి సంబంధించి స్తానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై కొలువైన మీసాల స్వామి ఆలయానికి తిరుపతి ఏడుకొండల సామి ఆలయం అంతటి పేరు ప్రతిష్టలున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి తర్వాత అంత స్థాయిలో పూజలందుకుంటున్న సత్యదేవుని ఆలయంలో బ్రహ్మ కుమారీలు గత కొన్నేళ్లుగా బ్రహ్మకుమారిలు సభలను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా జనవరి 20 నుంచి 24 వరకూ అన్నవరం క్షేత్రంపై సభలు ఏర్పాటు చేశారు.అందుకు ఆలయ కార్యనిర్వాహక అధికారి అనుమతి ఇవ్వడం సభలు మొదలు కావడం జరిగిపోయాయి. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ సభల్లో బ్రహ్మకుమారీలు చెప్పే బోధనా అంశాలనే తప్పుబడుతున్నారు. వాళ్ల సిద్దాంతాను వాళ్లకిష్టమొచ్చినట్టు ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ అన్నవరం క్షేత్రంపై మాత్రం బ్రహ్మకుమారీలు అందించే కరపత్రంలో ముద్రించిన అంశాలే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. దేవుడు 1937లో ఈ సష్టిపై అవతరించినట్టు చెప్పడం….ఎవరిని బడితే వారిని భగవంతుని అవతారం అనడం సరైన విధానం కాదంటూ బ్రహ్మకుమారిలు చెప్పడం పట్ల హిందూ సమాజం వేలేత్తి ప్రశ్నిస్తోంది. అలాగే భగవంతుడు కుక్క పిల్లి…పంది, చేప, పాము వంటి వాటిల్లోనూ ఉన్నారనడాన్ని శ్రీ సత్య దేవుని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఆయా వాటిల్లో దేవుడున్నాడని పేర్కొనడం మహా పాపమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గహ ప్రవేశానికి…వివాహానికి శ్రీ స్వామి వారి వ్రతమాచరించి మరీ కార్యక్రమాలు చేపట్టే హిందూ భక్తులకు ఈ క్షేత్రంపై ఇప్పుడు శివ బాబాను పూజించమని చెప్పడం ఎంతవరకూ సమంజసమని అడుగుతున్నారు. శివ సదన్…విష్ణు సదన్…ఖాళీ స్థలాలు కూడా వీరికి ఉచింతంగా ఎందుకు ఇచ్చారనే దానిపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు డార్మెటరీలను కూడా ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బదినేలా వ్యవహరిస్తున్న ఇలాంటి చేష్టలను హిందూ సమాజం అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. అదే బ్రహ్మకుమారీలు క్రైస్తవ..ముస్లిం దర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టగలరా అని కడిగేస్తున్నారు.బ్రేక్ వేసిన హిందూ ఐక్య పోరాట సమితి .రత్నగిరిపై బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సభకు ఎట్టకేలకు హిందూ ఐక్య పోరాట సమితి బ్రేక్ వేసింది. సభలకు యిచ్చిన గదులు, ఇతర స్థలాలను రద్దు చేయక పోతే కేటాయింపులు చేసిన స్థానిక అధికారులపై కమిషనర్ ద్రుష్టి కి తీసుకెళ్లి వారిపై వేటు పడే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు బ్రహ్మ కుమారీలను బుజ్జగించి అక్కడ నుంచి తరలించే యత్నం చేస్తున్నారు.

.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version