పి వి టి జి లకు మంజూరైన పీఎం జన్మన్ హౌసింగ్ ఇల్లును పెంచిన లక్ష రూపాయలు తక్షణమే విడుదల చేయాలని అరకు వేలి మండలం బస్కి పంచాయతీలో విస్తృతన ప్రచారం చేయడం జరిగిందని అనేక దశబ్దల కాలం నాటి నుండి అభివృద్ధికి దూరంగా ఉన్న పీవీటి జి లకు సమగ్ర అభివృద్ధి చేయాలని అనేక పోరాటాల ఫలితంగా మంజూరు అయిన పీఎం జన్మన్ ఇల్లులు బిల్లులు లేక పునాది స్థాయిలో గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ ఇల్లులు నిర్మాణం కోసం కేటాయించిన నిధులు సరిపోక మారుమూల ప్రాంతాలకు ఇల్లులు నిర్మించాలంటే చాలా కష్టంగా ఉంటుంది రోడ్డు లేక రవాణా సౌకర్యం లేక ఇసుక లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇసుక సరపర చేయడం లేదు ఒక్కొక్క ఇల్లు నిర్మాణానికి సుమారు పది లక్షలు ఖర్చు అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఇల్లు స్థలాలు లేక అనేకమంది పి వి టిజిలు ఇల్లులు నిర్మించుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెంచిన లక్ష రూపాయలు లబ్ధిదారులకు అందకపోవడం దారుణం పెంచిన లక్ష రూపాయలు ఇవ్వాలని ఈనెల 27వ తేదీన చలో ఐటిడిఏ పాడేరు కార్యక్రమం గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది తక్షణమే స్పందించి పివిటి జి లకు పెంచిన లక్ష రూపాయలు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు బురిడీ దశరథ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు గ్రామస్తులు ఉన్నారు.
