Home Business రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు… ప్రఖ్యాత సంస్థలతో 75 ఎంఓయూలు

రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు… ప్రఖ్యాత సంస్థలతో 75 ఎంఓయూలు

0
  • రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు
  • ప్రఖ్యాత సంస్థలతో 75 ఎంఓయూలు
  • గ్రీన్ ఎనర్జీ, ఐటీ, టూరిజం, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు
  • డ్రోన్, ఏరో స్పేస్ సీటీలకు వర్చువల్ శంకుస్థాపనలు
  • సీఐఐ సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
  • హాజరైన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్

భారతీయ పరిశ్రమల సమాఖ్య 30వ భాగస్వామ్య సదస్సు మరింత ఉత్సాహంగా జరిగింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో 40 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ₹3,49,476 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగా, 4,15,890 కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఏర్పడింది. సదస్సు ప్రారంభానికి ముందే గురువారం కూడా పలు ఎంవోయూలు చేసుకున్నారు. మొత్తం లో 75 ఎంఓయూల ద్వారా ₹7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, ఐటీ , టూరిజం హబ్‌గా మార్చే మలుపుగా మారింది. వైస్ ప్రెసిడెంట్ సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కె. రామ్ మోహన్ నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు పారిశ్రామివేత్తలు పాల్గొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్, మైనరల్స్, అగ్రీబిజ్‌నెస్, ఐటీ సెక్టార్లపై దృష్టి సారించాయి. రెండో రోజు మొత్తం పెట్టుబడులు రూ. 3,49,476 కోట్లు, ఇవి 4,15,890 ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం అంచనా. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ. 2.94 లక్షల కోట్ల పెట్టుబడులతో 69,800 ఉద్యోగాలు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ , టైవాన్ కంపెనీలు అలియన్స్ గ్రూప్, ఈజూల్ ఇండియా జేవీతో మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టులతో ఒప్పందాలు జరిగాయి. కొరమండల్ ఇంటర్నేషనల్ విశాఖ లో రూ. 2,000 కోట్లతో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, పెట్టనుంది. పోర్ట్స్, సెమెంట్, డేటా సెంటర్లు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్‌లో రూ 1 లక్ష కోట్ల అదనపు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. లోకేష్ ఐటీ , డిజిటల్ ఎకానమీ సెషన్లలో పాల్గొని, విశాఖపట్నం‌ను ఐటీ హబ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. దిగ్గజాలు ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కీలక ప్రకటనలు చేశారు. అదానీ సంస్థ డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రకటించింది. బజాజ్ విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్జ్ నిర్ణయించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1 జీడబ్ల్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచంలో అత్యంత అధునాతనమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్‌లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించనుంది.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్ శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు అవుతున్నాయి. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. స్పేస్ సిటీకి సంబంధించి బ్లూ స్పేస్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. అలాగే డ్రోన్ సిటీలో పెట్టుబడులకు అల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ అనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్సెల్మేజ్, ఏర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version