స్వామి శ్రీ దివ్యామృత సాయి ఆధ్యాత్మిక ప్రసంగం సభ్యులను ఆకట్టుకుంది. గురువారం రాత్రి చోడవరం ఆర్క్ కేంద్ర కార్యాలయo లోనూ, మాడుగుల మండలం ఒమ్మలి రామాలయంలోనూ స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విశ్రాంత ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా ఆర్క్ ప్రసాద్ అధ్యక్షతన ఆధ్యాత్మిక,సామాజిక ,మేధావుల సత్సంగ ఆధ్యాత్మిక,సామాజిక అంశాలు సమాజం నిర్మాణం పై అనేక అంశాలును శ్రీదివ్యామృత సాయి ప్రస్తావించారు.చోడవరం,మాడుగుల ప్రాంతాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ కి సంబంధించి పరిశీలన,పరిశోధన,జరుగుతుందని.. సంస్థ పై గురి,నమ్మకం ఏర్పడినప్పుడు మంచికార్యక్రమాలు ఏర్పడతాయన్నారు.ముందుగా మంచివతావరణాన్ని ఏర్పాటు చేసుకుని..ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు అభివృధి జరుగుతుందన్నారు.భవిష్యత్తు కార్యాచరణలో చోడవరం ప్రాంతం కూడా వుంటుందని భరోసా ఇచ్చారు.. ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు మాట్లాడుతూ శ్రీ దివ్యామృత సాయి జర్నీ..ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కొనియాడారు. భగవాన్ సత్య సాయి బాబా శిష్యులు రామ్ గోపాల్ వర్మ ప్రసంగం కూడా ఆకట్టుకుంది.అనంతరం పూజశ్రీ దివ్యామృత సాయి నీ సత్కరించారు. స్వామి చోడవరం విచ్చేసిన శుభ సందర్భంగా మాడుగుల,దేవరాపల్లి,చీడికాడ,చోడవరం ప్రాంతాల్లో గల నిరుపేద కుటుంబాలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ లను స్వామి చేతుల మీద అందజేశారు.సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు,పోలీస్ శాఖ, జ్యుడీషియల్ శాఖ,ఉపాధ్యాయ కమ్యూనిటీ,మహిళలు,సామాజిక సంస్థల ప్రతినిధులు,కళాకారులు,మహిళలు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఒమ్మలలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
