భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో శుక్రవారం భీమవరం బులియన్ అసోసియేషన్ అధ్వర్యంలో బి ఐ ఎస్ హెచ్ యూ ఐ డి పై అవగాహన సదస్సు నిర్వహించారు. బి ఐ ఎస్ హాల్ మార్క్ విజయవాడ బ్రాంచ్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బంగారు వస్తువుల వినియోగదారునికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి వస్తువుపై హెచ్ యూ ఐ డి ముద్ర తప్పనిసరిగా ఉండాలన్నారు వాటి వల్ల ఉపయోగాలను సంఘ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ హాల్ మార్క్ ఇంచార్జ్ అజయ్, సంఘ అధ్యక్షులు కోట్ల నాని, కోశాధికారి బొండా రాంబాబు, వబిలిశెట్టి పట్టాభి, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కోట్ల ప్రసాద్, యండగండి వాసు, తటవర్తి బదరి, బొండా శివ, కోట్ల గుప్త, కారుమూరి బదరి,కొమ్మోజు వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
