Home News వీ డెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ రమేష్ కు గౌరవ డాక్టరేట్

వీ డెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ రమేష్ కు గౌరవ డాక్టరేట్

0

ఉత్తరాంధ్రలో ప్రముఖ దంత వైద్య సంస్థ వీ డెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ కె.ఎం.కె. రమేష్ ను గౌరవ డాక్టరేట్ అవార్డు వరించింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మంగళవారం న్యూఢిల్లీలో ఆయనకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా వేలాది మందికి ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం, పేదలకు ఉచిత వైద్య సేవలు అందజేయడం, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా కే.ఎం.కే. రమేష్ కి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం వీ డెంటల్ వైద్య బృందం రమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ప్రశాంతి, అడ్మిన్ మేనేజర్ సిహెచ్ పార్వతి, వీ హెల్త్ కేర్ చీఫ్ మేనేజర్ సిహెచ్ కృష్ణ, మేరీ, తులసి, రాజేశ్వరి, ప్రశాంతి, అన్నపూర్ణ తదితరులు శుభాకాంక్షలు తెలియచేసారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version