Home Politics Andhra Pradesh హోంగార్డ్ కు రూ. 20 కోట్ల అక్రమాస్తులు

హోంగార్డ్ కు రూ. 20 కోట్ల అక్రమాస్తులు

0

డిప్యూటేషన్ పై ఏసీబీకి వెళ్లి ఆర్జన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చే సేది హోంగార్డు ఉద్యోగం. కానీ ఆస్తులు చూస్తే మాత్రం బిత్తరపోవాల్సిందే15 ఏళ్లుగా హోంగార్డుగా చేసే వ్యక్తి సాధారణంగా కుటుంబం నెట్టుకు రావడానికే అపసోపాలు పడతారు
అలాంటిది ఒక సాధారణ హోంగార్డు రూ.20 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం చర్చ నీయాంశంగా మారింది సదరు హోంగార్డుపై గతంలో అనేవక అవినీతి ఆరోపణలు సైత వెల్లువెత్తాయి ఈ క్రమంలో ఏడాది క్రితం సదరు హోంగార్డును జిల్లా పోలీస్ కార్యాలయానికి ఏసీబీ సరెడర్ చేసింది ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారు లకు సమాచారం ఇచ్చి పెద్దఎత్తున సొమ్ము చేసు కున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఏకకాలంలో అతడి ఇంట్లో బంధువల నివాసాల్లో సోదాలు నిర్వహించగా రూ.20 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది ఇంతకీ ఈ అవినీతి తిమింగలం ఎవరు? ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నాడు? ..

విజయనగరంలోని గోకపేటలో హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై ఏసీబీకి ఫిర్యాదు అందింది దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు విజయనగరం గోకపేటలోని నివాసంతో పాటు గుర్లమండలం నడు కూరి గ్రామం, విశాఖపట్నం లోని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించారు గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అధి కారులు సోదాలు నిర్వ హించారు ఈ సోదాలలో భాగంగా పలు ఆస్తులకు సంబంధించి కీలక డాక్యు మెంట్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.20 కోట్ల మేర అక్రమ ఆస్తులు?

హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు రూ.20 కోట్ల మేర అక్రమ ఆస్తలు సంపాదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 ఏళ్లుగా నెట్టి శ్రీనివాస రావు హోంగార్డుగా పని చేస్తున్నారు అయితే గతంలో పలు ప్రాంతాలలో పనిచేసి నప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో ఆయనను ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు అయితే ఒక సాధారణ హోంగార్డు రూ.20 కోట్లు ఎలా సంపాదించారు అనేదానిపై చర్చ జరుగు తుంది గతంలో ఏసీబీ హోం గార్డుగా పనిచేస్తున్న సమయంలో రైడ్ గురించి తెలుసుకుని వారికి ముందే సమాచారం అందించి భారీ మెుత్తంలో ఆస్తులు కూడ బెట్టారనే ప్రచారం జరుగు తుంది ఇలా రూ.20 కోట్ల వరకు సంపాదించారని తెలుస్తోంది అంటే తిన్నంటి వాసాలు లెక్కపెట్టి భారీ మెుత్తంలో ఆస్తులు కూడా బెట్టారని తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం రావాల్సిఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version