Home Politics Andhra Pradesh పక్షుల సంక్షేమం కోసం గ్రీన్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం

పక్షుల సంక్షేమం కోసం గ్రీన్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం

0

గ్రీన్ క్లబ్ వ్యయస్థాపకులు కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రముఖ దేవాలయాల్లో “వరి కంకులు”, ధాన్య గింజలు మరియు పక్షులకు తాగునీరు అందించే పాత్రలను పంపిణీ చేసారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ సోమసుందర్, మిషన్ కర్షకదేవోభవ నేషనల్ చైర్మన్ డా ఆడారి కిషోర్ కుమార్, కర్రి సన్యాసి నాయుడు, ఫారెస్ట్ రేంజర్ బీర వినోద్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు కాండ్రేగుల సత్యన్నారాయణ, డా కొణతాల రాజేష్, సురేష్, సంతోష్ పాల్గొన్నారు
పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యల్లో భాగంగా
ప్రస్తుత మానవ జీవనశైలిలో అంతరించిపోతున్న పిచ్చుకలు మరియు ఇతర పక్షుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా వేసవి కాలంలో వాటి దాహాన్ని తీర్చేందుకు మరియు ఆహారం అందించేందుకు గ్రీన్ క్లబ్ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి విశ్రాంతి ఉపాధ్యాయులు, ఫారెస్ట్ శాఖ అధికారులు, యువకులు, మహిళలు, న్యాయవాదులు మరియు వివిధ వృత్తుల్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version