Home Devotional ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి పల్లకి మహోత్సవం

ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి పల్లకి మహోత్సవం

0

పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతాబ్ది జయంతోత్సవములో
భాగంగా చినవాల్తేరు నగర వీధులలో స్వామి పల్లకి సేవ తిరువీధి ఊరేగింపు నిర్వహించారు, ఊరేగింపుకు ముందు పట్టా రెసిడెన్సిలో వేద పారాయణం, స్వామి అష్టోత్తరం, స్వామి కు మంగళ హారతి ఇచ్చి ఉత్సవ ఊరేగింపును శ్రీ సత్య సాయి సమితి సిటీ కన్వీనర్ సాయికుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం కార్యక్రమమును ఉద్దేశించి పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ ,శాంతి సమైక్యతకు, భగవాన్ శ్రీ సత్య సాయిమార్గం ఒక్కటే, సర్వ మతాలకు సత్యం ధర్మంలు ఒక్కటే అన్నది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మార్గం, నిస్వార్ధ సేవ మించిన దైవం లేదు, స్వచ్ఛమైన సేవ లో దైవం కొలువు ఉంటాది . దైవంను చూడాలి అనుకుంటే నలుగురికి సహాయం చేయు, దైవం నిన్ను వెతుకుంటు వస్తారు. దైవం అంటే ఎవరో వ్యక్తులు కాదు, సత్య ధర్ముల యందు ఉండే శక్తియే దైవం. కనుక అందరు సత్య ధర్ముల విడువకండి.అందరిని ప్రేమ తో పలకరించండి. సమభావంతో అందరితో మెలగండి. స్వామి దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరకు పదే పదే స్వామి భోదించడంపట్ల ,స్వామి సేవ మార్గం స్పూర్తితో పట్టా ఫౌండేషన్ స్థాపించి ఆధ్యాత్మిక ,సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తూ,
కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన శ్రీ సత్య సాయిబాబా భజన మండలి వాల్తేర్ అప్ లాండ్స్ కన్వీనర్ ఎస్ గంగరాజు , విశాఖపట్నం సత్యసాయి సేవ సమితి అధ్యక్షులు, కన్వీనర్ కు , వివిధ సత్యసాయి మండలి కన్వీనర్లకు , యూత్ కన్వీనర్లకు , స్వామి దివ్య ఆశీస్సులతో ఘనంగా పల్లకి ఉత్సవంలో భాగస్వాములు అయినా అందరిని సత్కరించి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జ్ఞాపికలను అందజేస్తూ కృతజ్ఞత నమస్కార ములు తెలియజేసారు కొత్త ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు. ఫౌండేషన్ సభ్యులు బొడ్డేడ వెంకటలక్ష్మి , పట్టా ఉదయ్ కిరణ్ , ఆర్ భాస్కర్ భారతి , దొడ్డి రమేష్,పెంటకోట శ్రీ లక్ష్మీ శ్రీదేవి , తాతా నాయుడు , పూర్ణచందు నూకరాజు , మోహిత వర్షిని తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version