Home Politics Andhra Pradesh విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యే అక్రమాలకు ప్రభుత్వ మద్దతు

విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యే అక్రమాలకు ప్రభుత్వ మద్దతు

0

కాంగ్రెస్ తూర్పు ఇంచార్జి ప్రియాంక దండి

విశాఖలో భూముల విలువ పెరగడంతో విశాఖ ఎంపీ శ్రీ భరత్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు ఆగడాలు పెరిగిపోయాయని వారికి జిల్లాలో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు మద్దతు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని గుర్తించి అధికారులు ఆ భూమిని వెనక్కి తీసుకుంటే విశాఖ నగర కార్పొరేషన్ లో అధికార మార్పిడి జరగగానే ఆ విలువైన భూమిని కౌన్సిల్ సహాయంతో అధికారికంగా ఎంపీ కొట్టేయాలని చూస్తున్నారని, అలాగే వెలగపూడి పై అనేక భూ దందా ఆరోపణలు ఉన్నాయని వారి అక్రమాలు అడ్డుకునే అధికారులంటే వారి ఆటలు సాగవని అలాంటి వారిని బదిలీ చేయిస్తున్నారని మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద విశాఖ నగరంలో అత్యంత కీలకమైన హార్బర్ ఏసీపీగా బదిలీ అయిన 24 గంటలలోనే తిరిగి శ్రీకాకుళం బదిలీ అవడానికి వెలగపూడి ప్రభుత్వంలో చక్రం తిప్పారని ఆరోపించారు. తమ భూ దందాలకు ఎవరు అడ్డు రాకూడదని తమ చెప్పు చేతల్లో ఉండే పోలీస్ అధికారులను నియమించుకుంటున్నారని విమర్శించారు. వీళ్లు చేసే భూ దందాలలో ప్రభుత్వ పెద్దలకు కూడ వాటాలు ఉన్నాయని అనుమానం కలుగుతోందని, కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని అందులో కూటమి నాయకుల సహకారం ఉందని హార్బర్ ఏసీపీగా వివేకానంద అడ్డు పడతాడని వెంటనే బదిలీ చేయించారని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ భరత్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు పాపం పండిందని విశాఖ ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని, ప్రభుత్వం మారితే వీరి అక్రమాల పై పూర్తి విచారణ కోరతానని ప్రియాంక పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version