Home Politics Andhra Pradesh బాలికలు కాన్సర్ బారిన పడొద్దు 

బాలికలు కాన్సర్ బారిన పడొద్దు 

0
 14వ ఏట అడుగుపెట్టిన బాలికలకు హెచ్ పి వి వాక్సినేషన్ వేయించాలి*
– జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
14వ సంవత్సరంలో అడుగు పెట్టిన బాలికలందరకు సమీపంలో గల ఆరోగ్య కేంద్రాలలో హెచ్ పి వి వాక్సిన్ వేయించి గర్భాశయ ముఖ ద్వార కాన్సర్ బారిన పడకుండా చూడాలని జిల్లా కలక్టరు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కోరారు.  సోమవారం కలక్టరేట్ లో జరిగిన సమావేశం లో గర్భాశయ ముఖ ద్వార కాన్సర్ వాక్సిన్ నిర్వాహన పై తగు సూచనలు చేశారు.  వాక్షినేషన్ తీసుకునే వారు ఆహారం తీసుకున్న తరువాత మాత్రమే వాక్షినేషన్ వేయించుకోవాలని అన్నారు.  ఎవరైనా ఉదయం ఆహరం తీసుకోకుండా వాక్షినేషన్ కేంద్రానికి వస్తే ఆహారం తిని రావాలని లేదా కేంద్రం వద్ద కొంత ఆహరం ఏర్పాటు చేయాలని, వాక్షినేషన్ అయిన తరువాత 30 నిముషాలు అబ్సర్వేషన్ లో ఉంచాలన్నారు.  జిల్లాలో  కౌమార   దశలో ఉన్న 17,743 మంది ఆడ పిల్లలను గుర్తించారని, 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టి 15వ సంవత్సరములోనికి రాకముందే జిల్లాలో గుర్తించిన 33 కేంద్రాలలో ఒక రోజు హెచ్ పి వి వాక్సిన్ ఉచితంగా వేస్తారన్నారు.  ఇప్పటి నుండి 3 నెలల వరకు ఈ వాక్సిన్ కేంద్రాలలో అందుబాటులో ఉంటుందన్నారు.  ఎఎన్ఎంలు,  నర్సులు వాక్సినేషన్ వేస్తారని, ఆషా, అంగన్వాడీ వర్కర్లు 14 సంవత్సరములు ఆడపిల్లలకు అవగాహన కల్పించి కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాదరి, జిల్లా ఇమ్మ్యూనై్జెషన్ అధికారి డా. లూసి కార్డిలియా, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డా. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version