Home Politics Andhra Pradesh సత్యం కోసం ప్రాణాలర్పించిన శాస్త్రవేత్త గియోర్డానో బ్రూనో

సత్యం కోసం ప్రాణాలర్పించిన శాస్త్రవేత్త గియోర్డానో బ్రూనో

0

– కె.ఎస్. లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ

విశ్వం యొక్క అనంతత్వాన్ని దర్శించి ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్త గియోర్డానో బ్రూనో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పినందుకు మతోన్మాదులు ఫిబ్రవరి 17, 1600 సంవత్సరంలో సజీవ దహనం చేశారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీన గుంటూరులోని రైల్ పేటలో గల కన్నా స్కూల్ లో సత్యాన్వేషణలో బ్రూనో బలిదానం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సత్యం కోసం ప్రాణాలర్పించిన ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో 426 వ వర్ధంతి జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. విశ్వం అనంతమైనదని,ఆకాశంలో కనబడే నక్షత్రాలు లక్షలాది ఉన్నాయని అవి సూర్యుని కన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉన్నా యని మొదటిసారి ప్రపంచానికి తెలిపినారన్నారు. బ్రూనో ఖగోళ శాస్త్రవేత్త మాత్రమే కాదని స్వేచ్ఛ ఆలోచనల కోసం పోరాడిన యోధుడు అని కొనియాడారు. గురువును ఆలోచనలు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసినాయని పేర్కొన్నారు. సత్యాన్ని అన్వేషించే క్రమంలో మత గ్రంథాలలోని వాక్యాలను గుడ్డిగా నమ్మరాదని 16వ శతాబ్దంలోనే గురువును స్పష్టంగా తెలిపినారన్నారు.సత్యాన్వేషణలో బ్రూనో బలిదానం పుస్తకాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ విశ్వంలో సౌర కుటుంబాలు లక్షలాది ఉన్నాయని బ్రూనో తెలిపారని పేర్కొన్నారు. గెలీలియో, కోపర్నకస్ లాంటి శాస్త్రవేత్తలు బ్రూనో ఆలోచనలను శాస్త్రీయంగా రుజువు చేసి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని, భూమి విశ్వానికి కేంద్రం కాదని రుజువు చేశారన్నారు. మతోన్మాదులు 1600 సంవత్సరం ఫిబ్రవరి 17న రోమ్ నగరంలో బ్రూనోను సజీవ దహనం చేశారని, 1889లో అదే ప్రాంతంలో బ్రూనో భావనలు వాస్తవమని శాస్త్రీయంగా రుజువైన తర్వాత బ్రూనో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారన్నారు. బ్రూనో ను 8 సంవత్సరాలు జైలులో ఉంచి సజీవ దహనం చేసినా తాను విశ్వసించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచంలో మానవాభివృద్ధికి మతం ఆటంకం గా వందలాది సంవత్సరాలు కొనసాగిందన్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న శాస్త్రవేత్తలను హీరోలుగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ బాబు, జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్ కమిటీ కన్వీనర్ టి. ఆర్. రమేష్, జిల్లా నేతలు సుభాని, ప్రవీణ్ లు పాల్గొని ప్రసంగించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version