పాడేరులోని శుక్రవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి నిర్వహించిన ప్రజా దర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. నియోజకవర్గం నుంచి అనేకమంది తమ సమస్యలు తెలియజేసేందుకు ఈశ్వరి స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యను వింటూ దానికి పరిష్కార మార్గాలను తెలియజేస్తూ కొన్నింటిని తానే అధికారులతో స్వయంగా మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని అధికారులకు సిఫారసు చేశారు కొందరు గృహ నిర్మాణాలకు సంబంధించి మరికొందరు సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యక్తిగత సమస్యలపై వినతలు అందజేశారు. సామాజిక పెన్షన్లు నూతనంగా మంజూరు చేయాలని పలువురు అభ్యర్థించారు. అందరు సమస్యలను వింటూ పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
గిడ్డి ఈశ్వరి ప్రజా దర్బార్ కు సమస్యల వెల్లువ
RELATED ARTICLES
