Home Politics Andhra Pradesh చిన్నపిల్లల వార్డును పరిశీలించిన జిజిహెచ్ సూపర్డెంట్

చిన్నపిల్లల వార్డును పరిశీలించిన జిజిహెచ్ సూపర్డెంట్

0

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సూపరింటెండెంట్ ఆసుపత్రిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా పరిశీలించిన డాక్టర్ కే శ్రీనివాసరావు . ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న, సిబ్బందితో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య చికిత్సలు, పరిశుభ్రత తదితర అంశాలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసిందని, ఆయా వార్డులలో పర్యటించి కొన్ని లోపల గమనించి, ఆ లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయనతో పాటు ఉన్న వైద్య అధికారులకు, సంబంధిత సిబ్బందికి పలు అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులను ప్రత్యేకంగా పరిశీలించిన తరువాత వారికి అందుతున్న చికిత్స, ఆహారం, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని సూపరింటెండెంట్ ఈ పర్యవేక్షణ అనంతరం తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ అన్నపూర్ణ, డాక్టర్ ఎర్రయ్య, బి ప్రసాద్, ఎల్ ఎస్ ఎస్, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version