Home Politics Andhra Pradesh లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

0

రావికమతం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల చోడవరం సెక్టార్ కే కాలనీ ద్వారకా నగర్ అంగన్వాడీ కేంద్రాల్లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో భాగంగా రూపొందించిన యాక్షన్ ప్లాన్ (మార్చ్1-16) లో భాగంగా కిషోర్ బాలికలకు సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి గురువారం లబ్ధిదారులకు తల్లిదండ్రులకు లింగ నిర్ధారణ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ బి శాంతిప్రియ మాట్లాడుతూ స్వచ్ఛత పక్కవాడ పక్షోత్సవాల్లో భాగంగా పరిసరాల శుభ్రత చేతుల పరిశుభ్రత తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వంటి కార్యక్రమాల గురించి, అలాగే అంగన్వాడీ కేంద్రాలు లోపల బయట పరిశుభ్రంగా ఉంచడం వంటి విషయాలు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులందరికీ, కిషోర్ బాలికలికి బాల్యవివాహాలు వాటి వలన కలుగు అనర్ధాలు గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో కే కాలనీ ద్వారకా నగర్ అంగన్వాడి కార్యకర్తలు బి కృష్ణవేణి, వి ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version