Home Politics Andhra Pradesh గ్యాస్ కొరత… వినియోగదారులు ఆందోళన

గ్యాస్ కొరత… వినియోగదారులు ఆందోళన

0

రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవలేశ్వరం ప్రాంతంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేసిన వినియోగదారులు పదిరోజులు గడిచినా సరఫరా జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతిరోజూ వంట అవసరాల కోసం గ్యాస్‌పై ఆధారపడుతున్న ప్రజలు సరఫరా లేక ఇబ్బందులు పడుతూ, ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు డీలర్లను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే గ్యాస్ లేక కుటుంబాలు రోజువారీ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version