Home Politics Andhra Pradesh అరకులో కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం పర్యటన.

అరకులో కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం పర్యటన.

0

అరకు పర్యటన లో మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం కి ఘన స్వాగతం పలికిన*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి. అనంతరం ఆమె ఆధ్వర్యంలో* *కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం*
*బుధవారం అరకు పర్యటనకు విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి,* *జెడి శీలం కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.*
*అరకు చేరుకున్న వెంటనే పార్టీ శ్రేణులు పూల బొకేలు, పుష్పగుచ్ఛాలు అందజేసి హర్షాతిరేకాలతో ఆహ్వానించారు. గిరిజన ప్రాంతంలో జెడి శీలం పర్యటనకు విపరీతమైన ప్రజా స్పందన కనిపించిందని నాయకులు తెలిపారు*.
*మన్రేగా చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా జరుగుతున్న ఈ పర్యటన గిరిజన ప్రాంతాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. గ్రామీణ పేదలు, గిరిజనులు, కూలీల జీవనాధారమైన ఉపాధి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.*
*జెడి శీలం పర్యటనతో అరకు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, గిరిజన హక్కులు, ఉపాధి భరోసా, అభివృద్ధి అంశాలపై భవిష్యత్ కార్యాచరణను మరింత దృఢంగా అమలు చేస్తామని నాయకులు తెలిపారు*.
*ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, కిసాన్ సెల్ అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు*.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version