1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీల స్వీకరణ .
జిల్లా కలెక్టర్ నిషాoతి.టి
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ టి నిషాoతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
జిల్లాలో ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం నిర్వహించే విధంగా నిర్వహించనున్న గ్రీవెన్స్- మీకోసం, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి నీలకంఠరావు, ఇన్చార్జ్ ఆర్డిఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు అర్జీదారుల నుండి వినతులను స్వీకరిస్తారని, అదేవిధంగా డివిజనల్, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు . ఈ కార్యక్రమం ద్వారా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి అర్జీ దారుని సమస్యను బట్టి సంబంధిత శాఖ అధికారులకు ఎండర్స్ చేసి అర్జీను బదిలీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండలలో తాసిల్దార్లు, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఫిర్యాదులను “meekosam . ap. gov. in” మీ కోసం వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని, అలాగే 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీ యొక్క స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు. పీపుల్స్ ఫస్ట్ ధోరణిలో ప్రజ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ఇస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. అదనంగా పౌర సేవలు మరింత సులభతరం చేయడానికి ఫోన్ 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా సేవల అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
