Home Politics Andhra Pradesh ట్రాఫిక్ నియమాల పాటిస్తేనే ప్రాణరక్షణ

ట్రాఫిక్ నియమాల పాటిస్తేనే ప్రాణరక్షణ

0

జిల్లా ప్రజలకు ఎస్పీ నరసింహ కిషోర్ పిలుపు
జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలను జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించింది. రహదారి ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని సూచించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించిన ఎస్పీ, చిన్న తప్పిదమే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాదాలను నివారించవచ్చని, పోలీస్ శాఖతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొని రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version