Home Politics Andhra Pradesh టర్నింగ్ వద్ద ఫ్లెక్సీలు.. ప్రజలకు ఇబ్బందులు

టర్నింగ్ వద్ద ఫ్లెక్సీలు.. ప్రజలకు ఇబ్బందులు

0

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఐరన్ బ్రిడ్జి టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. టర్నింగ్ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఉండటంతో రోడ్డు స్పష్టంగా కనిపించక వాహనాలు తిప్పుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీలు, ప్రకటన బోర్డులు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version