Home Politics Andhra Pradesh జాతీయo లో ఘనత చాటిన ఐతం విద్యార్థులు

జాతీయo లో ఘనత చాటిన ఐతం విద్యార్థులు

0

సాంకేతిక నైపుణ్యాత ను సాధించారు,సీఎం చంద్రబాబు చేతుల ద్వారా స్వర్ణ బహుమతి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని సాకిపల్లి కొత్తూరు వద్ద నున్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించిన క్వాంటం సాంకేతిక పోటీల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్తంగా పాల్గొన్న వేలాది బృందాల్లో నెగ్గి ఘన విజయం సాధించడం చాలా హర్షదాయకమని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు ఆనందం వ్యక్తపరిచారు.

ఆదిత్య కళాశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యం గల అధ్యాపకులు అవగాహన చేసుకుని విద్యార్థులు భవిష్యత్తు నిర్మాణానికి ప్రతిభాను చాటారని ఆయన అన్నారు ఈ పోటీల్లో 20వేల మంది విద్యార్థులు పాల్గొనగా అందులో ఆదిత్య విద్యార్థులు తమ ప్రతిభతో విజయం సాధించడం అసాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్, చేతులు మీదుగా తమ విద్యార్థులు స్వర్ణ బహుమతి 50000 నగదు పురస్కారాన్ని అందుకున్నారని ఇది హర్షించదగ్గ విషయమని డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. విజేతలకు ప్రముఖ కంపెనీల నుంచి ఇంటర్నెట్ షిప్ ఉద్యోగ అవకాశాలు దక్కాయని ఆయన తెలిపారు.

ఐతం కళాశాల విద్యార్థుల విషయంపై కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడా సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్ ఎల్ నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాల ప్రతిష్టత ను మరింత పెంచిన విద్యార్థులను ప్రశంసించారు.

ఈ బృందంలో యు రాజేశ్వరరావు, దీపక్, గుణ సాగర్, గాయత్రి, ప్రవీణ, నీలిమ, సమన్వయకర్త డాక్టర్ బి కిరణ్ కుమార్, డాక్టర్ స్వరూప రాణి తదితరులు ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version